వైయస్, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలతో కేసీఆర్ కొట్లాడారు: కేటీఆర్
- నిన్నకాక మొన్న పదవులు వచ్చిన వారు కేసీఆర్ పై ఎగిరెగిరి పడుతున్నారు
- కేసీఆర్ తో తలపడటానికి డైలాగులు కొడితే సరిపోదు
- కేసీఆర్ ను ఎదుర్కొనే శక్తి తెలంగాణలో ఎవరికీ లేదు
వైయస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలతో కొట్లాడిన చరిత్ర కేసీఆర్ దని కేటీఆర్ అన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీలో నాలుగు సీట్లు గెలిచేసరికి బీజేపీ నేతలు రెచ్చిపోయారని... ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యే సరికి అసలు విషయం వారికి అర్థమయిందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను ఎదుర్కోగల శక్తి తెలంగాణలో ఎవరికీ లేదని అన్నారు.