Corona Virus: తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

Media Bulletin on status of positive cases COVID19 in Telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,23,005 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,362 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఈ మేరకు వివరాలను వెల్లడించింది. అదే సమయంలో 1,813 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐసోలేష‌న్‌లో, ఆసుప‌త్రుల్లో 18,568 మంది చికిత్స తీసుకుంటున్నారు.

రాష్ట్రంలో 24 గంటల్లో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసులు 6,12,196కి చేరుకున్నాయి. ఇక‌ మొత్తంగా చూస్తే, 5,90,072 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 3,556 మంది మృతి చెందారు. రాష్ట్రంలో రికవరీ రేటు 96.38 శాతంగా, దేశ రికవరీ రేటు 96.12 శాతంగా ఉంది.

            
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News