Teja Sajja: 'హనుమాన్'గా తేజ సజ్జ ఖరారైనట్టే!

  • 'ఓ బేబీ'తో దక్కిన గుర్తింపు
  • 'జాంబి రెడ్డి'తో పెరిగిన క్రేజ్
  • 'హనుమాన్'లో లభించిన ఛాన్స్
  • త్వరలో సెట్స్ పైకి    
 Teja sajja is seen as hero in  Hanuman movie

తెలుగు తెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసినవారిలో చాలా తక్కువమంది మాత్రమే ఆ తరువాత కూడా రాణించారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసిన తేజ సజ్జ, ఇప్పుడు టీనేజ్ లోకి అడుగుపెట్టేశాడు. మంచి హైటూ .. పర్సనాలిటీతో ఆకట్టుకుంటున్నాడు. 'ఇంద్ర' సినిమాలో తొడ గొట్టిన ఆ పిల్లాడేనా ఈ కుర్రాడు అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ' ఓ బేబీ' సినిమాలో సమంతకి మనవడిగా నటించి మెప్పించిన ఈ కుర్రాడు, 'జాంబి రెడ్డి' సినిమాలో హీరోగా అందరి దృష్టిలో పడ్డాడు. ఆ సినిమా హిట్ కావడంతో, వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే 'జాంబి రెడ్డి' దర్శకుడు ప్రశాంత్ వర్మ మరో సినిమా కోసం తేజను తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ తన నుంచి 'హనుమాన్' అనే సినిమా రానున్నట్టు ఇటీవలే ప్రకటించాడు. ఈ సినిమాలో కథానాయకుడిగా ఆయన తేజను ఎంపిక చేసుకున్నాడట. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేలా సన్నాహాలు చేసుకుంటున్నారట. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. చూస్తుంటే తేజ సజ్జ కుర్ర హీరోలకు గట్టిపోటీ ఇచ్చేలానే ఉన్నాడు.

More Telugu News