నీలం సాహ్నీ నియామకంపై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసిన హైకోర్టు

High Court takes up a petition against Neelam Sahni appointments as SEC
  • ఎస్ఈసీగా సాహ్నీ నియామకాన్ని సవాల్ చేస్తూ పిల్
  • హైకోర్టులో నేడు విచారణ
  • మరికొంత సమయం కోరిన పిటిషనర్
  • అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు
ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ గా నీలం సాహ్నీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు నేడు విచారించింది.  విజయవాడకు చెందిన గుర్రం రామకృష్ణ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ఈసీ నియామక జాబితాలో ప్రభుత్వం పంపిన 3 పేర్లు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరఫున న్యాయవాది ఆరోపించారు. మరిన్ని అదనపు వివరాలు దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. అయితే, ఈ దశలో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి సమాచారం లేకుండా పిల్ ఎలా వేస్తారని ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
Go Back to Shorts
AP High Court
Neelam Sahni
SEC
Petition

More Telugu News