GST Council: జీఎస్టీ మండలి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!

  • నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశం
  • కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆచితూచి నిర్ణయాలు
  • భారం పడకుండా నిర్ణయాలు
  • అనేక విధాలా ఊరట కలిగించే ప్రయత్నం
GST Council key decisions

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన నేడు జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు. సింగిల్ అజెండాతో జీఎస్టీ మండలి సమావేశం జరిగిందని తెలిపారు. కరోనా ఔషధాలు, పరికరాలపై పన్నులు తగ్గించినట్టు చెప్పారు.

జీఎస్టీ మండలి నిర్ణయాలు...

  • టోసిలిజుమాబ్, బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఆంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లపై జీఎస్టీ మినహాయింపు.
  • ఆక్సిజన్ యూనిట్లు, టెస్టింగ్ కిట్లు, పల్స్ ఆక్సీమీటర్లపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గింపు.
  • ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాలపై జీఎస్టీ తగ్గింపు.
  • కొవిడ్ చికిత్సలో ఉపయోగించే 3 రకాల మందులపై జీఎస్టీ తగ్గింపు.
  • రెమ్ డెసివిర్ పై 12 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గింపు.
  • వ్యాక్సిన్, టెంపరేచర్ కొలిచే పరికరాలపై 5 శాతం జీఎస్టీ యథాతథం.
  • అంబులెన్సులపై 28 నుంచి 12 శాతానికి జీఎస్టీ తగ్గింపు.
  • శ్మశాన వాటికల్లో వినియోగించే ఎలక్ట్రిక్ ఫర్నెస్ (విద్యుత్ ఆధారిత దహన వేదిక)లపై 5 శాతం జీఎఈస్టీ తగ్గింపు
  • హ్యాండ్ శానిటైజర్లపై జీఎస్టీ కుదింపు.

More Telugu News