Nagarjuna: నాగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్!

Huge set for Nagarjuna action movie
షార్ట్స్‌లో చూడండి
నాగార్జున .. ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో ఒక యాక్షన్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను 'గోవా'లో పూర్తి చేశారు. రెండవ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేస్తున్నారు. జూన్ మొదటివారం నుంచి ఈ సెట్లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నాగార్జున జోడీగా కాజల్ కనిపించనుంది.

'గరుడ వేగ' వంటి భారీ హిట్ తరువాత ప్రవీణ్ సత్తారు వెంటనే మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాలని చూశాడు. కానీ ఏదో ఒక కారణంగా ఏ ప్రాజెక్టు సెట్ కాలేదు. దాంతో చూస్తుండగానే గ్యాప్ వచ్చేసింది. మొత్తానికి ఆయన నాగార్జునను లైన్లో పెట్టేశాడు. ఇటీవల నాగార్జున యాక్షన్ సినిమాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. 'ఆఫీసర్' .. 'వైల్డ్ డాగ్' సినిమాలే అందుకు నిదర్శనం. ప్రవీణ్ సత్తారు యాక్షన్ కథ చెప్పగానే ఆయన రంగంలోకి దిగిపోయారు. ఈ సినిమాలో యాంకర్ రష్మీ కూడా ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
Go Back to Shorts
Nagarjuna
Kajal Agarwal
Rashmi Gautam

More Telugu News