ఏపీలో వైఎస్సార్ ప్రీప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లు... అధికారులతో చర్చించిన సీఎం జగన్
- తాడేపల్లి క్యాంపు కార్యాలయలో సీఎం సమీక్ష
- అత్యుత్తమ ప్రమాణాలతో విద్యపై చర్చ
- నిరుపేద చిన్నారులకు నాణ్యమైన విద్య
- పిల్లలకు కిలోమీటరు దూరంలోనే ప్రీప్రైమరీ స్కూళ్లు
చిన్నారుల్లో 6 ఏళ్ల లోపే 80 శాతం మేధో వికాసం కలుగుతుందని, ఆ వయసులోని నిరుపేద చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రీప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లు ఉపయోగపడతాయని తెలిపారు. వైఎస్సార్ ప్రీప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లు అన్నీ పిల్లలకు కిలోమీటరు దూరంలోనే ఉండాలని, అన్ని హైస్కూళ్లు 3 కిలోమీటర్ల దూరంలోనే ఉండాలని, ఆ విధంగా స్కూళ్ల మ్యాపింగ్ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.