చాలా అప్సెట్ అయ్యాను: రాఖీ సావంత్
- ముంబైపై తీవ్ర ప్రభావం చూపిన తౌతే తుపాను
- భారీ వృక్షాలు, కరెంట్ పోల్స్ కూలిన పరిస్థితి
- కూలిన రాఖీ సావంత్ ఇంటి బాల్కనీ రూఫ్ టాప్
లోఖండ్ వాలాలో రాఖీ సావంత్ కొత్తగా నిర్మించుకున్న ఇంటి బాల్కనీ రూఫ్ టాప్ భారీ వర్షాల కారణంగా కూలిపోయింది. ఈ నేపథ్యంలో రాఖీ సావంత్ మాట్లాడుతూ, ఈ ఘటనతో తాను చాలా అప్సెట్ అయ్యానని చెప్పింది. మరోవైపు తుపాను నేపథ్యంలో బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, కరీనా కపూర్, కార్తీక్ ఆర్యన్ తదితరులు నగర ప్రజలను హెచ్చరించారు. ఇంటి నుంచి ఎవరూ బయటకు రావద్దని కోరారు.