టీఎన్నార్ కుటుంబానికి తనవంతు సాయం అందించిన దర్శకుడు మారుతి
- కరోనాకు బలైన టీఎన్నార్
- టీఎన్నార్ కుటుంబానికి చిత్ర పరిశ్రమ చేయూత
- ఇప్పటికే సంపూర్ణేశ్, చిరంజీవి సాయం
- టీఎన్నార్ భార్య ఖాతాలో రూ.50 వేలు జమ చేసిన మారుతి
దీనిపై ట్విట్టర్ లో వివరించారు. టీఎన్నార్ కుటుంబానికి బాసటగా నిలవాల్సిన సమయం అని పేర్కొన్నారు. "టీఎన్నార్... వుయ్ మిస్ యూ. అయితే నీ కుటుంబానికి మేమంతా అండగా ఉంటాం" అంటూ మారుతి ట్వీట్ చేశారు. అంతేకాకుండా, "లెట్స్ సపోర్ట్ టీఎన్నార్ ఫ్యామిలీ" అనే ప్రచారాన్ని కూడా ముందుకు తీసుకెళ్లారు.