Corona Virus: దేశంలో కరోనా కేసుల తాజా వివరాలు

  • నిన్న‌ కొత్త‌గా 3,48,421 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,29,92,517
  • మొత్తం 17,52,35,991 మందికి వ్యాక్సిన్లు 
  • 30,75,83,991 కరోనా పరీక్షలు
Media Bulletin on status of positive cases COVID19 in india

దేశంలో నిన్న‌ కొత్త‌గా 3,48,421 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,55,338  మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,33,40,938కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 4,205 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,54,197కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  1,93,82,642 మంది కోలుకున్నారు. 37,04,099 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 17,52,35,991  మందికి వ్యాక్సిన్లు వేశారు.
      
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 30,75,83,991 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,83,804  శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News