Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • పూజ హెగ్డే మధుర సందేశాలు!
  • చిరంజీవికి కథ రెడీ చేసిన సందీప్ రెడ్డి
  • 'కేజీఎఫ్ 2' విడుదల వాయిదా?
Pooja Hegde sends sweet messages

*  అందాలతార పూజ హెగ్డే ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులకు స్వీట్ మెసేజెస్ పంపుతోంది. పవన్ కల్యాణ్ ప్రతి ఏడూ తన తోటలో పండిన మామిడిపళ్లను సన్నిహితులకు గిఫ్టుగా పంపుతూవుంటాడు కదా, అలాగే ఈ చిన్నది కూడా ఇప్పుడు తమ తోటలో పండిన మామిడి పండ్లను ప్యాక్ చేయించి, టాలీవుడ్ లోని తన సన్నిహితులకు పంపుతోందట.
*  ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. మంచి కథతో ఏ దర్శకుడు వచ్చినా, వింటున్నారు. నచ్చితే కనుక వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కూడా మెగాస్టార్ కోసం ఓ కథను తయారుచేశాడట. త్వరలోనే చిరంజీవిని కలసి వినిపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
*  యశ్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన 'కేజీఎఫ్ 2' చిత్రం విడుదల వాయిదా పడింది. వాస్తవానికి ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో జులై 16న విడుదల కావాల్సి వుంది. అయితే, ప్రస్తుతం కరోనా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్నందున వచ్చే దసరాకు ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నారు.

More Telugu News