Corona Virus: దేశంలో కొత్త‌గా 4,03,738 మందికి కరోనా

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,22,96,414
  • నిన్న‌ 4,092 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 2,42,362  
  • 16,94,39,663 మందికి వ్యాక్సిన్లు  
  Media Bulletin on status of positive cases COVID19 in india

భార‌త్‌లో క‌రోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. నిన్న‌ కొత్త‌గా 4,03,738  మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,86,444  మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,22,96,414కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో  4,092 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,42,362కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,83,17,404 మంది కోలుకున్నారు.37,36,648 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 16,94,39,663 మందికి వ్యాక్సిన్లు వేశారు.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 30,22,75,471 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 18,65,428 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News