కమలహాసన్ రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తున్నారా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కమలహాసన్ రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తున్నారా?

Is Kamal Haasan decided to quit politics
  • అసెంబ్లీ ఎన్నికల్లో కమల్‌కు ఘోర పరాభవం
  • త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం
  • తమిళనాడులో జోరుగా చర్చ
మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ చీఫ్ కమలహాసన్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారా? తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఆయనను తీవ్రంగా వేధిస్తోందని, ఈ కారణంగానే ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పాలనుకుంటున్నారని చెబుతున్నారు. అంతేకాదు, త్వరలోనే ఆయనీ నిర్ణయాన్ని వెల్లడిస్తారని కూడా అంటున్నారు.

దీనికి తోడు పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా జారుతుండడం కూడా ఆయన నిర్ణయానికి మరో కారణంగా చెబుతున్నారు. వైస్ ప్రెసిడెంట్ మహేంద్రన్ సైతం పార్టీని వీడారు. కమల హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీపై ప్రజల్లో ఆసక్తి లేకపోవడం, కార్యకర్తల్లో నైరాశ్యం, ఇప్పట్లో మరే ఎన్నికలు లేకపోవడం వంటివి కూడా కమల్ నిర్ణయానికి కారణమని తమిళనాడులో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కమల్ తన  పార్టీని మూసేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
Kamal Haasan
Tamil Nadu
MNM

More Telugu News