Corona Virus: క‌రోనాతో నిన్న దేశంలో 3,689 మంది మృతి

  • నిన్న‌ కొత్త‌గా 3,92,488 మందికి కరోనా  
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 1,95,57,457
  • దీంతో మృతుల సంఖ్య మొత్తం 2,15,542
  • 15,68,16,031 మందికి వ్యాక్సిన్లు వేశారు.  
Media Bulletin on status of positive cases COVID19 in india

భార‌త్‌లో క‌రోనా కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి. నిన్న‌ కొత్త‌గా 3,92,488 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,07,865  మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 1,95,57,457కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 3,689 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,15,542 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,59,92,271 మంది కోలుకున్నారు. 33,49,644 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 15,68,16,031 మందికి వ్యాక్సిన్లు వేశారు.
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 29,01,42,339 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 18,04,954 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News