దేశంలో క‌రోనా ఉగ్ర‌రూపం.. ఒక్క‌రోజులో 4 ల‌క్ష‌ల మందికి పైగా సోకిన క‌రోనా

01-05-2021 Sat 10:02
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 1,91,64,969
  • నిన్న‌ 3,523 మంది  మృతి
  • మృతుల సంఖ్య 2,11,853
  • 15,22,45,179 మందికి వ్యాక్సిన్లు    
Media Bulletin on status of positive cases COVID19 in india

భార‌త్‌లో క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చింది. నిన్న‌ కొత్త‌గా  4,01,993 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 2,99,988 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 1,91,64,969కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 3,523 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,11,853 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,56,84,406 మంది కోలుకున్నారు. 32,68,710 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 15,49,89,635 మందికి వ్యాక్సిన్లు వేశారు.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 28,83,37,385 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,45,299 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.