Indigo: నేడు విజయవాడ నుంచి వెళ్లే పలు విమానాలను రద్దు చేసిన ఇండిగో

  • 9.15 గంటలకు తిరుపతి స్పెషల్ ఫ్లైట్
  • హైదరాబాద్-విజయవాడ-విశాఖ లింక్ ఫ్లైట్
  • రాత్రి 9.10 గంటలకు హైదరాబాద్ వెళ్లాల్సిన విమానాల రద్దు
Indigo Cancelled some flights from Vijayawada

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన పలు విమానాలను నేడు రద్దు చేసినట్టు ఇండిగో అధికారులు తెలిపారు. ఈ ఉదయం 7.50 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరాల్సిన విమానంతో పాటు 8.55 గంటలకు విజయవాడ వచ్చి తిరిగి 9.15 గంటలకు తిరుపతి వెళ్లే స్పెషల్ ఫ్లైట్, మధ్యాహ్నం 15.20కి విజయవాడ వచ్చి 20 నిమిషాల తర్వాత తిరిగి బయలుదేరే హైదరాబాద్-విజయవాడ-విశాఖపట్టణం లింక్ సర్వీస్ ఫ్లైట్, రాత్రి 8.45 గంటలకు నగరానికి చేరుకుని తిరిగి 9.10కి హైదరాబాద్ తిరిగి వెళ్లే విమాన సర్వీసులను ఇండిగో సంస్థ రద్దు చేసింది.

More Telugu News