గత నెలలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఆరెస్సెస్ చీఫ్.. కరోనాతో ఆసుపత్రిలో చేరిక
- గత నెల 7న భయ్యాజీ జోషితో కలిసి తొలి డోస్ తీసుకున్న భగవత్
- లక్షణాలు కనిపించడంతో పరీక్షలు
- పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కింగ్స్‌వే ఆసుపత్రిలో చేరిక
దీంతో ఆయన వెంటనే నాగ్‌పూర్‌లోని కింగ్స్‌వే ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని ఆరెస్సెస్ వర్గాలు తెలిపాయి. కాగా, మార్చి 7న మోహన్ భగవత్ ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషితో కలిసి నాగ్‌పూర్‌లోని నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు.