India: దేశంలో ఒక్క రోజులో 1.26 ల‌క్ష‌ల‌ మందికి కరోనా నిర్ధారణ

India reports 126789 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో క‌రోనా విజృంభ‌ణ తీవ్ర స్థాయిలో ఉంది. ప్ర‌తి రోజు ల‌క్ష‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. దేశంలో గ‌త 24 గంటల్లో 1,26,789 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 59,258  మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,29,28,574 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 685 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,66,862 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,18,51,393 మంది కోలుకున్నారు. 9,10,319  మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా  9,01,98,673 మందికి వ్యాక్సిన్లు వేశారు.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 25,26,77,379 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 12,37,781 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
India
Corona Virus
COVID19

More Telugu News