అమెజాన్ ప్రైమ్ లో అడుగుపెడుతున్న 'జాతిరత్నాలు'
- బడ్జెట్ పరంగా చిన్న సినిమా
- వసూళ్ల పరంగా పెద్ద సినిమా
- ఈ నెల 11 నుంచి అమెజాన్ ప్రైమ్ లో
ఇంత హిట్ అయింది కదా .. బరువైన కథా? అనుకుంటే అదీలేదు.. దర్శకుడు తేలికపాటి కథాకథనాలతో సరదాగా నవ్విస్తూ, హాయిగా థియేటర్లో గడిపాము అనుకునేలా చేశాడు. అలాంటి ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాళ్లు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. చూసినవాళ్లు మళ్లీ చూడటానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇక్కడ ఈ సినిమా ఏ స్థాయిలో దూసుకుపోతుందో చూడాలి.