Gorantla Butchaiah Chowdary: దీనికి రాష్ట్రంలో 'కమల'నాథులు ఏమి సమాధానం చెబుతారు?: గోరంట్ల బుచ్చయ్యచౌదరి

gorantla slams ycp
షార్ట్స్‌లో చూడండి
పుదుచ్చేరి ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి ప్ర‌త్యేక హోదా ఇస్తామంటూ బీజేపీ నేత‌లు చేస్తోన్న వ్యాఖ్య‌ల ప‌ట్ల టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. మొన్న ఏపీకే కాదు దేశంలో ఎక్కడా ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర ప్ర‌భుత్వం చెప్పింద‌ని టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి అన్నారు.  

నిన్న ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమ‌ని ఎన్డీఏ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింద‌ని ఆయ‌న‌ గుర్తు చేశారు. నేడు పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామ‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అంటున్నార‌ని విమర్శించారు. ఈ విష‌యాల‌పై రాష్ట్రంలో  'కమల'నాథులు ఏమి సమాధానం చెబుతారని బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజును ఆయ‌న ప్ర‌శ్నించారు.   
Go Back to Shorts
Gorantla Butchaiah Chowdary
Telugudesam
YSRCP

More Telugu News