Corona Virus: ఏపీలో కోరలు చాస్తున్న కరోనా.... 1000 దాటిన కొత్త కేసుల సంఖ్య

 Corona new cases stream continues in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ తీవ్ర రూపు దాల్చుతోంది. గత కొన్నిరోజులుగా అంతకంతకు పెరుగుతున్న కొత్త కేసుల సంఖ్య తాజాగా 1000 దాటింది. గడచిన 24 గంటల్లో 31,142 కరోనా పరీక్షలు చేయగా 1,005 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 225 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 184, విశాఖ జిల్లాలో 167, కృష్ణా జిల్లాలో 135 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 324 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 8,98,815 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,86,216 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. కొత్త కేసులకు తగ్గట్టుగానే యాక్టివ్ కేసుల సంఖ్య కూడా మరింత పెరిగింది. ఏపీలో ప్రస్తుతం 5,394 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మరణాల సంఖ్య 7,205కి చేరింది.
Go Back to Shorts
Corona Virus
Positive Cases
Andhra Pradesh
Active Cases
Deaths

More Telugu News