ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ములపొదిలో మరో 10 రాఫెల్ యుద్ద విమానాలు
- 36 రాఫెల్ విమానాల కోసం ఫ్రాన్స్ తో ఒప్పందం
- రెండు, మూడ్రోజుల్లో 3 రాఫెల్ విమానాల రాక
- వచ్చే నెలలో భారత్ చేరుకోనున్న మరో 7 విమానాలు
- వాయుసేన సత్తాను మరింత పెంచిన రాఫెల్ విమానాలు
రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కు చైనా, పాకిస్థాన్ లపై గట్టి ఆధిపత్యాన్ని అందిస్తున్నాయి. గగనతలంలో వీటి సామర్థ్యం అంతాఇంతా కాదు. శత్రుదేశాల సరిహద్దులు దాటకుండానే ప్రత్యర్థులపై దాడి చేయగలవు. రాడార్లకు చిక్కకుండా తక్కువ ఎత్తులో దూసుకెళ్లడమే కాదు, ఒకే సమయంలో భిన్న లక్ష్యాలను ఎంచుకుని దాడులు చేసే అత్యంత అధునాతన ఎలక్ట్రానిక్ వ్యవస్థలు దీంట్లో పొందుపరిచారు. స్కాల్ప్, మెటియోర్ వంటి విధ్వంసక క్షిపణులను రాఫెల్ కు జతచేయడంతో దీని సత్తా మరింత పెరిగింది.