ఓటర్లను ఆకర్షించేందుకు తలకిందులుగా నడుస్తూ కారును లాగిన వ్యక్తి.. వీడియో ఇదిగో
- తమిళనాడులో ఘటన
- ఆర్ఎస్ పురంలో ఎన్నికల ప్రచారం
- మంత్రి వేలుమణికి మద్దతుగా కారును లాగిన యోగా టీచర్
ఆర్ఎస్ పురంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాడీఎంకే అభ్యర్థి, రాష్ట్ర మంత్రి ఎస్‌పీ వేలుమణికి మద్దతుగా ఓ యోగా టీచర్ కారులాగాడు. మామూలుగా కాదు.. తలకిందులుగా నడుస్తూ నడుము, కారుకి మధ్య చైను కట్టుకుని ఆ వాహనాన్ని లాగాడు. దీని వల్ల తన అభిమాన నేతకు ప్రచారంతో పాటు యోగాపై కూడా ప్రజల్లో అవగాహన కల్పించవచ్చని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.