increments: ఆరు నెల‌ల్లో రెండు సార్లు జీతాలు పెంచిన టీసీఎస్‌.. ఉద్యోగులు ఖుషీ!

tcs gives increments
షార్ట్స్‌లో చూడండి
భార‌త‌ ఐటీ సంస్థ‌ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్) త‌మ‌ ఉద్యోగులందరి జీతాల‌ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ఆరు నెలల వ్య‌వ‌ధిలోనే టీసీఎస్‌ చేస్తున్న రెండో వేతన పెంపు ఇది. వ‌చ్చేనెల‌ నుంచే ఈ పెంపు అమల్లోకి రానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీతాల‌ను పెంచిన తొలి సంస్థ టీఎస్ఎస్ కావ‌డం గ‌మ‌నార్హం.

వేత‌నాలు పెంచుతున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌యోజ‌నం పొందుతున్న‌ 4.7 లక్షల మంది ఉద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఆఫ్‌షోర్‌ ఉద్యోగులకు సగటున 6-7 శాతం మేర పెంపు ఉంటుంద‌ని ఆ సంస్థ వివ‌రించింది.

దీని వ‌ల్ల ఆరు నెలల వ్యవధిలోనే 12-14 శాతం మేర సగటు ఇంక్రిమెంటు ఉద్యోగుల‌కు ల‌భించి‌న‌ట్లు అయింది. గ‌త ఏడాది అక్టోబరులోనూ టీసీఎస్ త‌మ‌ ఉద్యోగులకు వేత‌నాలు పెంచింది. వ‌చ్చేనెల నుంచి పదోన్నతులను ఇవ్వ‌నుంది.
Go Back to Shorts
increments
tcs
India

More Telugu News