Jagan: ఈ గొప్ప విజయం ప్రజలది... మీ వల్లే సాధ్యమైంది: సీఎం జగన్

  • ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం
  • ట్విట్టర్ లో స్పందించిన సీఎం జగన్
  • ఇది చారిత్రక విజయం అంటూ అభివర్ణించిన సీఎం
  • బాధ్యతను మరింత పెంచిందని వ్యాఖ్య 
  • మరింత పాటుపడతానని ఉద్ఘాటన
CM Jagan terms YCP victory as historic in AP Municipal Elections

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అత్యంత ఘనమైన రీతిలో విజయాలు సాధించడం తెలిసిందే. దీనిపై సీఎం జగన్ స్పందించారు. ఈ గొప్ప విజయం ప్రజలందరిదని వినమ్రంగా పేర్కొన్నారు. దేవుని దయతో ప్రతి అక్కచెల్లెమ్మ, ప్రతి సోదరుడు, ప్రతి అవ్వ, ప్రతి తాత మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం వల్లే ఈ చారిత్రక విజయం సాధ్యమైందని తెలిపారు.  

ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని, బాధ్యతను ఈ విజయం మరింత పెంచిందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇంకా మంచి చేసేందుకు మీ కుటుంబంలో ఒకరిగా మరింత తాపత్రయ పడతాను అని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి సోదరుడికి, ప్రతి అక్కచెల్లెమ్మకు హృదయపూర్వక అభినందనలు అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

More Telugu News