రేపటి నుంచి వరుసగా నాలుగు రోజులు బ్యాంకుల మూత
- 13 రెండో శనివారం, 14 ఆదివారం
- సోమ, మంగళవారాల్లో బ్యాంకుల బంద్
- ప్రైవేటీకరణను నిరసిస్తూ యూనియన్ల బంద్ పిలుపు
బ్యాంకుల ప్రైవేటీకరణపై ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేసినా, లేదంటే యూనియన్లు సమ్మె ప్రతిపాదనను ఉపసంహరించుకుంటే తప్ప ఈ నాలుగు రోజులూ బ్యాంకులు మూతపడడం పక్కా అన్నమాటే. అయితే, ఊరట కలిగించే అంశం ఏమిటంటే.. బ్యాంకులు మూతలో ఉండే ఈ నాలుగు రోజులు మొబైల్, ఇంటర్నెట్ బ్యాకింగ్ సేవలకు మాత్రం ఎలాంటి ఆటంకాలు ఉండకపోవడమే. బ్యాంకులు నాలుగు రోజులు మూతపడతాయి కాబట్టి ఏటీఎంలలో నగదు నిల్వలు కూడా కరిగిపోవచ్చు. కాబట్టి అత్యవసరంగా నగదు అవసరమయ్యేవారు ముందుగా మేల్కొనడం మేలు.