Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • 'సర్కస్' షూటింగులో పూజ హెగ్డే 
  • పవన్ సినిమా బడ్జెట్ 150 కోట్లు
  • గీతా ఆర్ట్స్ లో కార్తికేయ మరొకటి  
Pooja Hegde joins Circus shoot

*  ప్రస్తుతం తెలుగు సినిమాలతో బిజీగా వున్న కథానాయిక పూజ హెగ్డే మరోపక్క హిందీ సినిమాలలో కూడా నటిస్తోంది. ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'సర్కస్' షూటింగ్ ముంబైలో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం షూటింగులో పూజ జాయిన్ అయింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు.
*  పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్లో రూపొందుతున్న పిరీడ్ చిత్రానికి 'హరి హర వీరమల్లు' టైటిల్ని ఖరారు చేస్తూ, నిన్న అధికారికంగా ప్రకటించిన సంగతి విదితమే. ఇక ఈ చిత్రానికి సంబంధించిన బడ్జెట్టు గురించి కూడా నిర్మాత వెల్లడించారు. సుమారు 150 కోట్ల బడ్జెట్టుతో ఇది తెరకెక్కుతోందని, పవన్ సినిమాలలో అత్యధిక బడ్జెట్ చిత్రం ఇదేనని పేర్కొన్నారు.
*  తాజాగా గీతా ఆర్ట్స్ సంస్థలో 'చావు కబురు చల్లగా' చిత్రంలో హీరోగా నటించిన కార్తికేయ అదే బ్యానర్లో మరో చిత్రాన్ని కూడా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సుకుమార్ తో కలసి గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుంది. నవంబర్ నుంచి షూటింగ్ నిర్వహించే ఈ చిత్రానికి ఓ కొత్త కుర్రాడు దర్శకత్వం వహిస్తాడు.  

More Telugu News