Corona Virus: భార‌త్‌లో కొత్త‌గా 17,921 మందికి కరోనా నిర్ధారణ

India reports 17921 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
భార‌త్‌లో గత 24 గంటల్లో 17,921 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం...  20,652 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,62,707కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 133 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,063కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,09,20,046 మంది కోలుకున్నారు. 1,84,598 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 22,34,79,877 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,63,081 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News