సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- పూజ హెగ్డేకు భారీ పారితోషికం
- 'దృశ్యం 2'లో రానా గెస్ట్ పాత్ర?
- హైదరాబాదుకొస్తున్న 'లైగర్'
* ఇటీవల మలయాళంలో వచ్చిన 'దృశ్యం 2' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. వెంకటేశ్, మీనా జంటగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. కాగా, ఇందులో రానా దగ్గుబాటి ఓ గెస్ట్ పాత్రను పోషించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
* విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లైగర్' చిత్రం తాజా షెడ్యూలు గత కొన్నాళ్లుగా ముంబైలో జరుగుతోంది. అక్కడ కొవిడ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం చివరి షెడ్యూలును హైదరాబాదులో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.