హిందూపురం పర్యటనలో వైసీపీపై మండిపడ్డ నందమూరి బాలకృష్ణ!
- వ్యవస్థలను నిర్వీర్యం చేసింది
- నలుగురు మంత్రులతో మాఫియా
- ఈ రెండేళ్లలో ఏయే అభివృద్ధి పనులు చేశారు?
- ప్రజలు తిరగబడే రోజు వస్తుంది
ఏపీలో నలుగురు మంత్రులతో మాఫియా నడుపుతున్నారని చెప్పారు. కొందరు వైసీపీ నేతలు తనను విమర్శిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు అధికారంలో ఉన్న ఈ రెండేళ్లలో ఏయే అభివృద్ధి పనులు చేశారన్న విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాగే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడితే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని విభాగాలను ప్రైవేటు పరం చేస్తున్నారని ఆయన విమర్శించారు.