మిస్సెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన ఖమ్మం యువతి!
- అహ్మదాబాద్ లో జరిగిన పోటీలు
- తెలంగాణ నుంచి ఫైనల్ కు అర్హత సాధించిన ఫర్హా
- మిస్సెస్ ఫోటోజెనిక్ అవార్డు కూడా
ఎంబీయే విద్యను అభ్యసించిన ఆమె, ప్రస్తుతం మానవ హక్కులు, సోషల్ జస్టిస్ మిషన్, మహిళా సాధికారత సంస్థలకు ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఈ విజయం తరువాత మీడియాతో మాట్లాడిన ఆమె, మహిళల హక్కుల పరిరక్షణకు పోరాడతానని తెలిపారు. భర్తతో పాటు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు, వారి ప్రోత్సాహంతోనే తాను ఈ విజయం సాధించానని చెప్పారు.