ఆయుధాలకు వ్యతిరేకంగా పోరాడాం... ఎలుకలకు భయపడతామా?: మమతా బెనర్జీ
- పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వేడి
- మాతృభాషా దినోత్సవంలో మమత వ్యాఖ్యలు
- జైలు పేరిట భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడి
- ప్రాణం ఉన్నంతవరకు భయపడేది లేదన్న మమత
తాము ఓటమి గురించి ఆలోచించడంలేదని, వాళ్లకు (బీజేపీ) తమను ఓడించేంత సత్తా లేదని స్పష్టం చేశారు. 2021లో ఎవరేంటో తెలిపోతుందని, తాను గోల్ కీపర్ గా ఉండి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది ప్రత్యక్షంగా చూస్తానని అన్నారు. తన మాతృభాష బంగ్లా అని, తన అమ్మ భాష తనకు పులిలా పోరాడడమే నేర్పిందని తెలిపారు. ఆయుధాలకు వ్యతిరేకంగా పోరాడామని, ఎలుకలకు భయపడబోమని స్పష్టం చేశారు.