India: భార‌త్‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

  • గత 24 గంటల్లో 9,121 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,25,710
  • మృతుల సంఖ్య 1,55,813
  • 87,20,822 మందికి వ్యాక్సిన్
india reports 9121 new COVID19 cases

దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 9,121 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 11,805 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,25,710 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 81 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,813కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,33,025  మంది కోలుకున్నారు. 1,36,872  మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 87,20,822 మందికి వ్యాక్సిన్ వేశారు.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 20,73,32,298 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 6,15,664 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News