ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మల్లాడి కృష్ణారావు

Yanam MLA Malladi Krishna Rao resigns
  • 25 ఏళ్లుగా యానాం ఎమ్మెల్యేగా ఉన్న మల్లాడి
  • తన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులను చేపట్టిన వైనం
  • కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని వ్యాఖ్య
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో భాగమైన యానాం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు తన పదవికి రాజీనామా చేశారు. యానాంకు 25 ఏళ్లుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. గత నెల 6న ఆరోగ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. పుదుచ్చేరి ప్రభుత్వంలో ఆయన ఎన్నో పదవులను చేపట్టారు. ఇకపై ఏ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు. కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ... మరో మార్గంలో ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. మరోవైపు మల్లాడి ప్రకటనతో యానాం ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. ఇంత కాలం ఆయన చేసిన సేవలను స్మరించుకుంటున్నారు.
Go Back to Shorts
Malladi Krishna Rao
Yanam
MLA
Resignation

More Telugu News