'రాధే శ్యామ్'కు ముగ్గురు సంగీత దర్శకుల పాటలు!

Three music directors working for Radhe Shyam
షార్ట్స్‌లో చూడండి
మామూలుగా ఏ సినిమాకైనా.. దానిని ఎన్ని భాషల్లో నిర్మించినా.. దానికి ఒకే సంగీత దర్శకుడు పనిచేస్తాడు. అయితే, ఇందుకు భిన్నంగా ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' సినిమాకి మాత్రం మొత్తం ముగ్గురు సంగీత దర్శకులు పనిచేస్తుండడం ఓ విశేషంగా చెప్పుకోవాలి.

ఈ సినిమా దక్షిణాది వెర్షన్లకు అంటే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లకు జస్టిన్ ప్రభాకరన్ పాటలను చేస్తుండగా.. హిందీ వెర్షన్ కి మాత్రం ఇద్దరు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. అక్కడ రెండు పాటలకు మిథున్.. మరో పాటకు మన్నన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. నిజంగా ఇదొక విశేషమనే చెప్పాలి.

వేలంటైన్స్ డే నాడు టీజర్

ఇక ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను ఈ నెల 14న వేలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రత్యేకమైన అప్ డేట్ ను ఈ రోజు చిత్ర బృందం ఇచ్చింది. ఆ రోజు 9.18 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

ప్రభాస్, పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జులై 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Go Back to Shorts
Prabhas
Pooja Hegde
Radha Krishna
Radhe Shyam

More Telugu News