మా నాన్న రెండు సార్లు సీఎం అయినా డబ్బుకు ఆశ పడలేదు.. జగన్ కోట్లు సంపాదించాడు: కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి
- వైసీపీ బెదిరింపులకు భయపడం
- ప్రజాసేవే మా లక్ష్యం
- ప్రజలు బాగుండటమే మాకు కావాలి
వైసీపీ బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని కోట్ల అన్నారు. టీడీపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని చెప్పారు. ప్రజలు బాగుండటమే తమకు కావాలని అన్నారు. ప్రజాసేవే తమ లక్ష్యమని చెప్పారు. పేకాట, బెట్టింగులను ప్రోత్సహిస్తున్న వైసీపీ నేతలను అరెస్ట్ చేసే దమ్ము పోలీసులకు ఉందా? అని ప్రశ్నించారు.