నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బెదిరేవారు లేరు: నిమ్మగడ్డపై విజయసాయి వ్యాఖ్యలు

Vijayasai Reddy comments on Nimmagadda
  • ఎస్ఈసీ, ఏపీ సర్కారు మధ్య మాటల యుద్ధం
  • అధిక ప్రసంగాలు తప్ప పని చేయడన్న విజయసాయి
  • పచ్చనేతలను మించి మాట్లాడుతున్నాడని విమర్శలు
  • ఆన్ లైన్ అంటూ పుల్లలు పెడుతున్నాడని ఆగ్రహం
ఏపీలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతోంది. తాజాగా, నిమ్మగడ్డపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. అధిక ప్రసంగాలు తప్ప పని చెయ్యడని, పచ్చనేతలను మించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బెదిరేవారు లేరు అంటూ స్పష్టం చేశారు. ఓవైపు సజావుగా ఎన్నికలు జరుగుతుంటే ఇప్పుడు ఆన్ లైన్ అంటూ పుల్లలు పెడుతున్నాడని మండిపడ్డారు. నిమ్మగడ్డ పచ్చనేత రాసిచ్చిన స్క్రిప్టునే చదువుతున్నాడని విజయసాయి విమర్శించారు.
Go Back to Shorts
Vijayasai Reddy
Nimmagadda Ramesh Kumar
Gram Panchayat Elections
YSRCP
Andhra Pradesh

More Telugu News