తెలంగాణ‌లో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

24-01-2021 Sun 09:54
  • కొత్తగా 197 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,253
  • కోలుకున్న వారు 2,88,275 మంది
  • మృతుల సంఖ్య 1,589
197 new cases in telangana

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 197 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 376 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,253కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,88,275 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,589కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 3,389 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1842 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 32 కరోనా కేసులు నమోదయ్యాయి.