తెలంగాణ‌లో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

22-01-2021 Fri 09:48
  • కొత్తగా 214 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,92,835
  • కోలుకున్న వారు 2,87,468 మంది
  • మృతుల సంఖ్య 1,586  
214 new cases in telangana

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 214 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 351 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,92,835కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,87,468 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,586కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 3,781 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,178 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 38 కరోనా కేసులు నమోదయ్యాయి.