లయన్ + టైగర్ = 'లైగర్'... విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ విడుదల!
- ఈ ఉదయం 10 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల
- వినూత్నంగా 'లైగర్' అని పేరు పెట్టిన పూరి
- సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ లో విజయ్ శిక్షణ
ఇక ఈ సినిమా కోసం థాయ్ లాండ్ లో మార్షల్ ఆర్ట్స్ పై విజయ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. పూరితో పాటు చార్మి, కరణ్ జొహార్ లు ఈ సినిమాను నిర్మిస్తుండటంతో, ఇది క్రేజీ ప్రాజెక్టుగా మారింది. 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫ్లాప్ కావడంతో, తదుపరి సినిమాతో హిట్ కొట్టాలన్న కసితో ఉన్న విజయ్ దేవరకొండ, ఈ సినిమా కోసం ఎంతో శ్రమించాడని ఫస్ట్ లుక్ చూస్తుంటేనే తెలిసిపోతోంది.