దేశీయంగా తయారైన మొట్టమొదటి మెషీన్ పిస్టల్ ఇదిగో!
- భారత బలగాలకు త్వరలోనే మెషీన్ పిస్టల్
- సైన్యం సహకారంతో అభివృద్ధి చేసిన డీఆర్డీఓ
- 'అస్మి'గా నామకరణం
- దీని పరిధి 100 మీటర్ల రేంజి
త్వరలోనే ఈ అత్యాధునిక తుపాకీ బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్ బీ వంటి పారామిలిటరీ దళాలకు అందనుంది. ఈ మెషీన్ పిస్టల్ రేంజి 100 మీటర్లు, దీని ఉత్పత్తి వ్యయం రూ.50 వేల లోపే ఉంటుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. దీన్ని విమానంలో ఉపయోగించే అల్యూమినియం, కార్బన్ ఫైబర్ తో తయారుచేశారు. ఇందులోని పలు భాగాలను త్రీడీ ప్రింటింగ్ సాయంతో రూపొందించడం విశేషం. దీనికి అస్మి అని నామకరణం చేశారు. అస్మి అంటే ఆత్మాభిమానం, గర్వకారణం, స్వయం కృషి అని అర్థం.