Corona Virus: తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్ డేట్స్!

  • కొత్తగా 293 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,87,108
  • మృతుల సంఖ్య మొత్తం 1,546
  • జీహెచ్ఎంసీలో కొత్తగా 72 కరోనా కేసులు
A total of 293 new COVID19 cases in telangana

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 293 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 535 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,87,108కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,79,991 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,546కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 5,571 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 3,418 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 72  కరోనా కేసులు నమోదయ్యాయి.

  

More Telugu News