Corona Virus: దేశంలో కొత్తగా 20,036 మందికి కరోనా పాజిటివ్

India reports 20036 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో గత 24 గంటల్లో 20,036 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. కొత్తగా 23,181 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,86,710కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 256 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,48,994కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 98,83,461 మంది కోలుకున్నారు.  2,54,254  మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 17,31,11,694 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 10,62,420 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News