Shruti Hassan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • బయోపిక్ కి టైటిల్ పెట్టుకున్న శ్రుతిహాసన్!
  • చైతూ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు
  • ఫైట్ తో 'ఫైటర్' తాజా షెడ్యూలు షూటింగ్  
  • 'కోతికొమ్మచ్చి' టాకీ పార్ట్ పూర్తి    
Shruti Hassan herself titled her biopic

*  కథానాయిక శ్రుతిహాసన్ తాజాగా అభిమానులలో ఇన్ స్టాగ్రామ్ లో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా ఓ అభిమాని ఫ్యూచర్ లో మీ బయోపిక్ తీస్తే ఏం టైటిల్ పెడతారని అడిగాడు. వెంటనే ఈ చిన్నది 'జ్వాలాముఖి' అని చెప్పింది. మరి సరదాగా చెప్పిందో.. లేక నిజంగానే చెప్పిందో కానీ, పలు ఎత్తుపల్లాలతో సాగే ఆమె జీవిత కథ బయోపిక్ కి సూట్ అవుతుందనే చెప్పచ్చు.  
*  అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రంకుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' పేరిట ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆమధ్య హైదరాబాదులో లాంఛనంగా మొదలైంది. ఇక ఇందులో చైతూ సరసన మొత్తం ముగ్గురు కథానాయికలు నటిస్తారట. ప్రస్తుతం వారి ఎంపిక జరుగుతున్నట్టు తెలుస్తోంది.
*  విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫైటర్' చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ ఈ నెల 26 నుంచి హైదరాబాదులో జరుగుతుంది. ముందుగా ఒక ఫైట్ ను చిత్రీకరిస్తారని తెలుస్తోంది.
*  'శతమానం భవతి' ఫేమ్ సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న 'కోతికొమ్మచ్చి' చిత్రం టాకీ పార్ట్ షూటింగ్ ఒక పాట మినహా మొత్తం పూర్తయింది. అమలాపురం, విశాఖ, హైదరాబాదులలో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. ఇందులో సమీర్ వేగేశ్న, మేఘాంశ్ శ్రీహరి హీరోలుగా నటిస్తున్నారు.

More Telugu News