Corona Virus: తెలంగాణలో 2,76,516కి చేరిన కరోనా కేసులు

612 new cases in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో గత 24 గంటల్లో 612 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 502 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,76,516కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,67,427 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,485కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 7,604 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 5,511 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 144, రంగారెడ్డి జిల్లాలో 73 కరోనా కేసులు నమోదయ్యాయి.
 
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News