భార్యా బాధితుడు... సెలవు ఇవ్వాల్సిందేనంటూ అధికారులను వేడుకున్న కానిస్టేబుల్!
- భోపాల్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న దిలీప్ కుమార్
- బావమరిది పెళ్లికి సెలవు కోరిన వైనం
- పెళ్లికి వెళ్లకపోతే భార్య చేతిలో బతకలేనని వాపోయిన పోలీసు
- ఇలాంటివి చాలా చూశామన్న అధికారులు
- సెలవు ఇవ్వలేమని స్పష్టీకరణ
ఒకవేళ తాను ఈ పెళ్లికి వెళ్లకపోతే జరిగే అనర్థాల గురించి తన భార్య ఇప్పటికే హెచ్చరించిందని, ఆ వివరాలను లేఖలో రాయలేని పరిస్థితి ఉందని, దయచేసి తనను అర్థం చేసుకుని సెలవు మంజూరు చేయాలని ప్రాధేయపడ్డాడు. దీనిపై పోలీసు అధికారులు స్పందించారు.
ఈ సెలవు చీటీని తాము తీవ్రంగా పరిగణించడంలేదని, కిందిస్థాయిలో ఉండే ఉద్యోగులు సాకులు చెప్పి సెలవులు అడగడం సాధారణమైన విషయమేనని అన్నారు. పోలీసు ఉద్యోగం ఎంతో ఒత్తిడితో కూడుకున్నదే అయినా, ప్రజలకు వారు ప్రతిక్షణం అందుబాటులో ఉండాల్సిందేనని, దిలీప్ కుమార్ కు సెలవు ఇవ్వలేమని వారు స్పష్టం చేశారు. ఇక నెటిజన్లయితే, ఎంతటివాడైనా భార్యాబాధితుడేనంటూ తమకు తోచిన దృష్టాంతాలను ఉదాహరిస్తున్నారు.