Rakul Preet Singh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • ప్రస్తుతం సింగిల్ గానే వున్నానంటున్న రకుల్! 
  • రవితేజ సినిమాకి మ్యూజిక్ సిటింగ్స్ షురూ
  • మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో విజయ్ దేవరకొండ 
  • ఈ నెల 18న ఏటీటీ ద్వారా వస్తున్న 'డర్టీ హరి' 
Rakul says she is very much single

*  ఒక యంగ్ హీరోతో తాను డేటింగ్ చేస్తున్నానంటూ వస్తున్న వార్తలను కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఖండించింది. ప్రస్తుతం తాను సినిమాలలో బిజీగా ఉన్నాననీ, అలాగే ప్రస్తుతం తాను సింగిల్ అనీ, ఎవరితోనూ ప్రేమలో లేననీ చెప్పింది.
*  రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఖిలాడి' చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో చెన్నైలో కంపోజింగ్ జరుగుతోంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూలు షూటింగ్ ఇటీవల ముగిసింది.
*  విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందే చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది వేసవిలో మొదలవుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుంది.
*  ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో రూపొందిన 'డర్టీ హరి' చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేస్తున్నారు. ఏటీటీ ఎఫ్.ఎమ్ ద్వారా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు ఎమ్మెస్ రాజు తెలిపారు. ఇది రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందిందని ఆయన చెప్పారు.

More Telugu News