బాయ్ ఫ్రెండ్ కొత్త పెళ్లాం కళ్లలో ఫెవికాల్ పోసిన ప్రియురాలు!

03-12-2020 Thu 19:17
  • మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న ప్రియుడు
  • అందరూ నిద్రిస్తున్న సమయంలో దాడి చేసిన ప్రియురాలు
  • ప్రియురాలిని చితకబాదిన బంధువులు
Boy friends lover attacks his new wife

తన ప్రియుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడాన్ని సహించలేకపోయిన ఓ ప్రియురాలు ఏకంగా కొత్త పెళ్లికూతురుపై దాడి చేసింది. వెంటనే అక్కడున్న బంధువులు ఆమెను చితకబాదారు. ప్రస్తుతం కొత్త పెళ్లికూతురు, ప్రియురాలు ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన బీహార్ లోని నలంద జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, మోడా తలాబ్ గ్రామానికి చెందిన గోపాల్ రామ్ అనే వ్యక్తికి షేక్ పురాకు చెందిన యువతితో గత మంగళవారం వివాహం జరిగింది. అదేరోజు సాయంత్రం తన భార్యను గోపాల్ రామ్ తన ఇంటికి తీసుకొచ్చారు. ఆ రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో అదే ఊరికి చెందిన గోపాల్ ప్రియురాలు అతని ఇంటికి వచ్చింది.

నిద్రపోతున్న పెళ్లికూతురుపై దాడి చేసింది. ఆమె జుట్టును కొంత కత్తిరించడమే కాక, ఆమె కళ్లపై ఫెవికాల్ పోసింది. ఆమె అరుపులు విన్న బంధువులు ఉలిక్కిపడి లేచారు. పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న ప్రియురాలిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్పించారు.