సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- విజయ్ దేవరకొండని పొగిడేస్తున్న అనన్య
- 'బంగార్రాజు'కి రెడీ అవుతున్న నాగార్జున
- 'విరాటపర్వం' షూటింగ్ మొదలెట్టిన రానా
* ఇటీవలే 'వైల్డ్ డాగ్' చిత్రాన్ని పూర్తిచేసిన హీరో నాగార్జున తదుపరి చిత్రంగా 'బంగార్రాజు' సినిమా చేయనున్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి జరుగుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
* వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న 'విరాటపర్వం' చిత్రం షూటింగ్ నిన్నటి నుంచి జరుగుతోంది. ఈ షెడ్యూలుతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది.