ఎల్బీ స్టేడియంలో రేపు కేసీఆర్ బహిరంగ సభ.. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేపు భారీ బహిరంగ సభ
- ట్రాఫిక్ మళ్లింపులపై పోలీసుల సూచన
- ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలన్న పోలీసులు
పోలీసు కంట్రోల్ రూము నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బషీర్‌బాగ్ బీజేఆర్ విగ్రహం చౌరస్తా వైపు అనుమతించరు. కాబట్టి ఏఆర్ పెట్రోలు బంక్, చాపెల్ రోడ్డు వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్లాల్సి ఉంటుంది. అబిడ్స్, గన్‌ఫౌండ్రి నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఎస్‌బీఐ (గన్‌ఫౌండ్రి) నుంచి చాపెల్ రోడ్డువైపు మళ్లిస్తారు. బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి అబిడ్స్ జీపీవో వైపు వచ్చే వారిని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కింగ్ కోటి రోడ్డువైపు మళ్లిస్తారు.
అలాగే, హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు మళ్లిస్తారు. లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు.